P Gannavaram: ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు – హాజరైన ఎమ్మెల్యే గిడ్డి
P Gannavaram: పి.గన్నవరంలో మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, అభిమానులు.
P Gannavaram: ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు – హాజరైన ఎమ్మెల్యే గిడ్డి
పి.గన్నవరం: త్రీ రోడ్డు సెంటర్లో మెగాస్టార్ కొణిదెల చిరంజీవి 71వ జన్మదిన వేడుకలను అభిమానులు, పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ.
మెగా యూత్ ఫోర్స్ రాష్ట్ర కో-కన్వీనర్ కందాల చంటి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులు, యువతతో కలిసి సంబరాలు జరుపుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తన ప్రతిభ, కష్టం, క్రమశిక్షణ, పట్టుదలతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని ఎమ్మెల్యే గిడ్డి. ఆయన కేవలం ఒక నటుడిగా మాత్రమే కాకుండా సేవాభావంతో సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.
అభిమానమంటే కేవలం సంబరాలు చేసుకోవడం మాత్రమే కాదని, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేయడమే నిజమైన అభిమానానికి అర్థమని అన్నారు. చిరంజీవి గారి జీవితం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో నిరంతరం కష్టపడితే విజయం సాధించవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
మెగాస్టార్ కొణిదెల చిరంజీవి సంపూర్ణ ఆరోగ్యం, ఆనందంతో నిండు నూరేళ్లు జీవించాలని, మరెన్నో మంచి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాలని, ఆయన సేవా స్ఫూర్తి తరతరాలకు ఆదర్శంగా నిలవాలని గిడ్డి సత్యనారాయణ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మెగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు




