Sakhinetipalli: రూ.7.10 కోట్లతో ఏటిగట్టు డబుల్ లైన్ తారు రోడ్డు నిర్మాణం!
Sakhinetipalli: సఖినేటిపల్లిలో రూ.7.10 కోట్లతో ఏటిగట్టు డబుల్ లైన్ తారు రోడ్డు నిర్మాణ పనులకు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు.
Sakhinetipalli: రూ.7.10 కోట్లతో ఏటిగట్టు డబుల్ లైన్ తారు రోడ్డు నిర్మాణం!
Sakhinetipalli: బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లిలో ఏటిగట్టు రోడ్డు అభివృద్ధికి చర్యలు చేపట్టారు. సఖినేటిపల్లి బోను నుంచి గుడిమూల శివాలయం వరకు ఏటిగట్టుపై వీబీజీ రామ్ జీ నిధులతో డబుల్ లైన్ తారు రోడ్డును నిర్మించనున్నారు.
ఈ రోడ్డు నిర్మాణ పనులకు రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు. రూ.7.10 కోట్ల వ్యయంతో 5.5 కిలోమీటర్ల పొడవున రోడ్డును నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు.
రోడ్డు నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే ఏటిగట్టు ప్రాంతాల ప్రజల రాకపోకలకు మరింత సౌకర్యం కలగడంతో పాటు, దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న రోడ్డు కష్టాలు తొలగనున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story




