Razole: అంతర్వేది కరలో 132/33 కేవీ సబ్‌స్టేషన్‌కు స్థల పరిశీలన!
Razole: కోనసీమ జిల్లా అంతర్వేది కరలో 132/33 కేవీ సబ్‌స్టేషన్ స్థలాన్ని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పరిశీలించారు.
Razole: అంతర్వేది కరలో 132/33 కేవీ సబ్‌స్టేషన్‌కు స్థల పరిశీలన!
రాజోలు: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, అంతర్వేది కర గ్రామపంచాయతీ పరిధిలో 132/33 కె.వి. విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి సంబంధించి రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆదివారం విద్యుత్ శాఖ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సబ్‌స్టేషన్ నిర్మాణానికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. సబ్‌స్టేషన్ ఏర్పాటు ద్వారా పరిసర ప్రాంతాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందడంతో పాటు లోవోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. రానున్న 25 నుంచి 30 సంవత్సరాల వరకు విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఈ సబ్‌స్టేషన్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
సబ్‌స్టేషన్‌కు అవసరమైన రహదారిని కూడా తగిన విధంగా వెడల్పు చేయాల్సి ఉందన్నారు. సబ్‌స్టేషన్ ఏర్పాటుతో స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పారు. సాంకేతికంగా సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఈ ప్రాంతం అనుకూలంగా ఉందని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
అంతర్వేది కర గ్రామంలోని ప్రధాన సమస్యలైన ముంపు, మంచినీరు, రహదారుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ హామీ ఇచ్చారు.




