Katrenipadu: కాట్రేనిపాడులో రాజముద్ర పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ!
Katrenipadu: కోనసీమ జిల్లా కాట్రేనిపాడులో రాజముద్రతో ఉన్న నూతన పట్టాదార్ పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ రైతులకు గురువారం పంపిణీ చేశారు.
Katrenipadu: కాట్రేనిపాడులో రాజముద్ర పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ!
Katrenipadu: అధునాతన సాంకేతిక ప్రక్రియ ద్వారా ప్రభుత్వం భూముల రీ సర్వేను నిర్వహిస్తోందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. రీ సర్వే పూర్తయిన అనంతరం భూములకు సంబంధించిన వివరాలను కచ్చితత్వంతో నమోదు చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నూతన పట్టాదార్ పాస్ పుస్తకాలను ప్రభుత్వం అందజేస్తోందన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం కాట్రేనిపాడు గ్రామంలో గురువారం రైతులకు రాజముద్రతో ముద్రించిన నూతన పట్టాదార్ పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రీ సర్వే ద్వారా భూముల హద్దులు, విస్తీర్ణం, యజమానుల వివరాలను మరింత కచ్చితంగా నమోదు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఉన్న భూ రికార్డుల్లోని సమస్యలను పరిష్కరించడంతో పాటు భవిష్యత్తులో భూములకు సంబంధించిన వివాదాలు తలెత్తకుండా రీ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు
రైతులకు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరిచి నూతన పట్టాదార్ పాస్ పుస్తకాలను ముద్రించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వీటి ద్వారా రైతులకు తమ భూములకు సంబంధించిన హక్కులు, వివరాలపై మరింత స్పష్టత లభిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ భూ రికార్డులను పారదర్శకంగా, ఆధునిక పద్ధతుల్లో నిర్వహిస్తోందన్నారు.
రాజోలు మండలంలో రెండు గ్రామాలు మినహా మిగిలిన అన్ని గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియ పూర్తయిందని దేవ వరప్రసాద్ తెలిపారు. మిగిలిన గ్రామాల్లోనూ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు నూతన పట్టాదార్ పాస్ పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రీ సర్వేకు రైతులు, గ్రామస్థులు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.




