Razole: 194 మంది లబ్ధిదారులకు రూ.కోటి విలువైన సీఎం ఆర్‌ఎఫ్ సాయం!

Razole: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం వి.వి.మెరకలో 194 మందికి రూ.కోటి విలువైన సీఎం ఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్.

PRABHU, RAZOLE
Published on: 15 Sept 2026 1:01 PM IST
Razole
X

Razole: 194 మంది లబ్ధిదారులకు రూ.కోటి విలువైన సీఎం ఆర్‌ఎఫ్ సాయం!

Razole: అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం ఆర్‌ఎఫ్) ఎంతో అండగా నిలుస్తోందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు.

సఖినేటిపల్లి మండలం వి.వి.మెరకలో నిర్వహించిన కార్యక్రమంలో 194 మంది లబ్ధిదారులకు రూ.కోటి విలువైన సీఎం ఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పంపిణీ చేశారు. వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం ఎంతో ఊరటనిస్తోందన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపద సమయంలో పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు రాజోలు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం ఆర్‌ఎఫ్ సహాయం అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు.

రాజోలు నియోజకవర్గంలో గత రెండున్నరేళ్లలో 1,540 మంది లబ్ధిదారులకు రూ.10.50 కోట్ల విలువైన సీఎం ఆర్‌ఎఫ్ సాయం అందించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజల కష్టాల్లో అండగా నిలుస్తూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE