Sakhinetipalli: రూ 12 కోట్లతో రోడ్డు పనులకు ఎమ్మెల్యే వరప్రసాద్ శంకుస్థాపన!

Sakhinetipalli: రాజోలు నియోజకవర్గంలో రూ.12.17 కోట్లతో 10 రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు. నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

PRABHU, RAZOLE
Published on: 26 Aug 2026 5:13 PM IST
Sakhinetipalli
X

Sakhinetipalli: రూ 12 కోట్లతో రోడ్డు పనులకు ఎమ్మెల్యే వరప్రసాద్ శంకుస్థాపన!

Sakhinetipalli: రాజోలు నియోజకవర్గంలో రహదారి సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సఖినేటిపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో రూ.12.17 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 10 రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు.

వి.వి.మెరకలో ఆర్‌&బి రోడ్డు నుంచి చావిడి పిల్లి వారి గ్రూప్ వరకు 2.273 కి.మీ. సీసీ రోడ్డుకు రూ.1.25 కోట్లు, మోరిపోడు మీదుగా బట్టేలంక లిమిట్స్ వరకు 1.911 కి.మీ. రహదారికి రూ.1.05 కోట్లు మంజూరయ్యాయి. శృంగవరప్పాడులో దొండపాటి వారి గ్రూప్ వరకు 1.410 కి.మీ. సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.1.30 కోట్లు కేటాయించారు.

అంతర్వేదికరలో సడక్ రోడ్డు నుంచి జిల్లా పరిషత్ హైస్కూల్ మీదుగా బీచ్ వరకు 2.10 కి.మీ. సీసీ రోడ్డుకు రూ.1.73 కోట్లు, అంతర్వేది ఆర్‌&బి రోడ్డు నుంచి అంతర్వేదికర నల్లా వారి గ్రూప్ వరకు 2.10 కి.మీ. బీటీ రోడ్డుకు రూ.1.62 కోట్లు మంజూరయ్యాయి.

రామేశ్వరంలో జిల్లా పరిషత్ రోడ్డు నుంచి గుడిమూల ఫెర్రీ రోడ్డు వరకు 1.440 కి.మీ. రహదారి నిర్మాణానికి రూ.1.08 కోట్లు, సఖినేటిపల్లిలంకలో కేఎన్‌ఎఫ్ రోడ్డు నుంచి చింతావారిపేట సీసీ రోడ్డు వరకు 0.900 కి.మీ. రహదారికి రూ.39 లక్షలు కేటాయించారు.

అప్పనరామునిలంకలో ఆర్‌&బి రోడ్డు నుంచి కొత్తలంక హరిజనవాడ వరకు 2.131 కి.మీ. సీసీ రోడ్డుకు రూ.1.17 కోట్లు, రావూరి వారి మెరక నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం మీదుగా ఆర్‌&బి రోడ్డు వరకు 1.300 కి.మీ. సీసీ రోడ్డుకు రూ.1.04 కోట్లు మంజూరయ్యాయి. అంతర్వేదిపాలెంలో కేఎన్‌ఎఫ్ రోడ్డు నుంచి మోరి–గొంది ఆర్‌&బి రోడ్డు వరకు 2.112 కి.మీ. సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.1.54 కోట్లు కేటాయించారు.

నాణ్యతతో పనులు పూర్తి చేయాలి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేయడమే లక్ష్యమన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో రోడ్డు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయిన అనంతరం రహదారులు ప్రజలకు అందుబాటులోకి రావడంతో గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story