Razole: రాజోలులో కస్టమ్ హైరింగ్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే!

Razole: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో మహిళా మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కస్టమ్ హైరింగ్ సెంటర్‌ను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు.

PRABHU, RAZOLE
Published on: 31 Aug 2026 4:52 PM IST
Razole
X

Razole: రాజోలులో కస్టమ్ హైరింగ్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే!

రాజోలు: రైతులపై వ్యవసాయ యంత్రాల కొనుగోలు భారం తగ్గించడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలులో కస్టమ్ హైరింగ్ సెంటర్ (CHC)ను ఏర్పాటు చేశారు. మహిళా మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని రాజోలు ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ సోమవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజోలు మండలంలో ఏర్పాటు చేసిన CHC ద్వారా ఖరీదైన వ్యవసాయ యంత్రాలను మార్కెట్‌లో ఉన్న అద్దె ధరల కంటే తక్కువకే రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ సదుపాయం ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఆధునిక వ్యవసాయ యంత్రాలను వినియోగించుకోవడం ద్వారా తక్కువ సమయంలో వ్యవసాయ పనులను పూర్తి చేసుకునే అవకాశం రైతులకు లభిస్తుందని పేర్కొన్నారు.

రాజోలు డ్వాక్రా మహిళా రైతు గ్రూపు ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. మహిళా సంఘాల భాగస్వామ్యంతో రైతులకు అవసరమైన వ్యవసాయ యాంత్రీకరణ సేవలు అందుబాటులోకి రావడం మంచి పరిణామమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సమాఖ్య డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ గణేష్, ఏపీఎం నాగమణి, సీసీలు వర్మ, దుర్గ, యానిమేటర్లు తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story