Razole: విద్యార్థినులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే!

Razole: సాంఘిక సంక్షేమ సమీకృత బాలికల వసతిగృహంలో విద్యార్థినులకు ప్రభుత్వం అందించిన నిత్యావసర వస్తువులు, వ్యక్తిగత సామగ్రిని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పంపిణీ చేశారు.

PRABHU, RAZOLE
Published on: 26 July 2026 6:05 PM IST
Razole
X

Razole: విద్యార్థినులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే!

రాజోలు: డాక్టర్ .బిఆర్ .అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గ పరిధిలోని రాజోలులో సాంఘిక సంక్షేమ సమీకృత బాలికల వసతిగృహంలో రాజోలు నియోజకవర్గానికి చెందిన విద్యార్థినులకు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన నిత్య వినియోగ వ్యక్తిగత సామగ్రి, నిత్యావసర వస్తువులను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థినుల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలలో ఒకటని పేర్కొన్నారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, పోషకాహారం, భద్రత మరియు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, సౌకర్యాలను విద్యార్థినులు సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం, ప్రతి సౌకర్యం అర్హులైన విద్యార్థినులకు సకాలంలో చేరేలా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, వసతిగృహ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story