Rajahmundry: రాజమండ్రిలో గ్యాస్ పైప్‌లైన్ పనులపై ఎమ్మెల్యే ఆగ్రహం!
Rajahmundry: గోదావరి గ్యాస్ పైప్‌లైన్ పనుల్లో భద్రతా లోపాలపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆగ్రహం. గోతుల చుట్టూ బ్యారికేడింగ్, హెచ్చరిక బోర్డులు పెట్టాలని ఆదేశించారు.
Rajahmundry: రాజమండ్రిలో గ్యాస్ పైప్‌లైన్ పనులపై ఎమ్మెల్యే ఆగ్రహం!
Rajahmundry: సిటీ నియోజకవర్గ పరిధిలో గోదావరి గ్యాస్ ప్రైవేటు లిమిటెడ్ కు సంబంధించిన గ్యాస్ పైప్‌లైన్ పనులను యూపీ ఎంటర్‌ప్రైజెస్ కాంట్రాక్ట్ ఏజెన్సీ, పలు ఏజెన్సీ లు చేపడుతున్నాయి. నగరంలోని ఏవీ అప్పారావు రోడ్డు తదితర ప్రాంతాల్లో రహదారులను తవ్వి పైప్‌లైన్ పనులు నిర్వహిస్తున్నారు.
ఈ పనుల సందర్భంగా ప్రజల భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంపై రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. నగర పాలక సంస్థ అధికారులు, సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన ఈ రోజు మాట్లాడి పనులు జరుగుతున్న ప్రాంతాల్లో తప్పనిసరిగా ప్రాపర్ బ్యారికేడింగ్, హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టివ్ క్లాత్/టేప్ వంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
రాత్రి వేళల్లో వాహనదారులు, పాదచారులు గోతులను గుర్తించలేక ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురికాకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు.
గోతులు తవ్విన ప్రాంతాలను చుట్టూ పూర్తిస్థాయిలో బ్యారికేడింగ్ చేయాలని, రాత్రి వేళల్లో స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ క్లాత్, హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలని, భద్రతా చర్యలు తీసుకోకుండా పనులు కొనసాగించవద్దని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశించారు.
అలాగే తవ్వకాలు పూర్తయిన ప్రాంతాల్లో పనులను ఆలస్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేసి రహదారులను పునరుద్ధరించాలని సూచించారు. తాను సూచించిన భద్రతా చర్యలను కాంట్రాక్టర్ వెంటనే అమలు చేసేలా చూడాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు తలెత్తకుండా చర్యలు




