Rajahmundry: విజయదుర్గా జూనియర్ కాలేజీలో "మీ భద్రత – మా బాధ్యత" సదస్సు

Rajahmundry: విజయదుర్గా జూనియర్ కాలేజీలో "మీ భద్రత – మా బాధ్యత" సదస్సు. విద్యార్థులకు, యువతకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కెరీర్ గైడెన్స్, కీలక సూచనలు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 27 Jun 2026 8:50 PM IST
Rajahmundry
X

Rajahmundry: విజయదుర్గా జూనియర్ కాలేజీలో "మీ భద్రత – మా బాధ్యత" సదస్సు

రాజమండ్రి: "తల్లికి నేరుగా చెప్పలేని పని జీవితంలో ఎప్పుడూ చేయొద్దు" అనే సందేశాన్ని ప్రతి విద్యార్థి తమ జీవిత సూత్రంగా మలచుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రతి నిర్ణయం తీసుకునే ముందు "ఈ విషయం నా తల్లికి ధైర్యంగా చెప్పగలనా?" అనే ప్రశ్నను తమను తాము వేసుకుంటే జీవితంలో తప్పుదారులు పట్టే పరిస్థితి ఎప్పటికీ రాదని ఆయన పేర్కొన్నారు.

నిజాయితీ, క్రమశిక్షణ, నైతిక విలువలు, బాధ్యతాయుతమైన ప్రవర్తనతో కూడిన జీవన విధానమే గొప్ప వ్యక్తిత్వానికి, విజయవంతమైన భవిష్యత్తుకు బలమైన పునాది అని అన్నారు. రాజమహేంద్రవరంలోని విజయదుర్గా జూనియర్ కళాశాలలో నిర్వహించిన "మీ భద్రత – మా బాధ్యత" అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగం చేశారు.

విద్యార్థుల భవిష్యత్తు ఎంత బలంగా ఉంటే రాష్ట్ర భవిష్యత్తు కూడా అంతే బలంగా ఉంటుందని పేర్కొంటూ.. యువత సరైన దిశలో ఎదగడం సమాజ పురోగతికి ఎంతో అవసరమన్నారు. విద్యార్థి దశ జీవితాన్ని మలిచే అత్యంత కీలకమైన కాలమని పేర్కొన్న ఆయన, ఈ సమయంలో అలవర్చుకునే క్రమశిక్షణ, విలువలు, అలవాట్లు జీవితాంతం వెంట ఉంటాయని చెప్పారు. అందుకే ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం అంకితభావంతో కృషి చేయాలని సూచించారు.

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఏ రంగంలో ముందుకు వెళ్లాలనుకుంటున్నారో ఇప్పటి నుంచే స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకుని దానికి అనుగుణంగా చదువులు, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ప్రపంచం వేగంగా మారుతోందని, భవిష్యత్తు పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఉండబోతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ వంటి రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

ప్రభుత్వం కూడా ఈ మార్పులకు అనుగుణంగా ప్రపంచ స్థాయి పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువస్తోందని చెప్పారు. గూగుల్ డేటా సెంటర్, ఇన్ఫోసిస్, టీసీఎస్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి అంతర్జాతీయ, జాతీయ స్థాయి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించబడుతున్నాయని తెలిపారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, నాయకత్వ లక్షణాలను కూడా పెంపొందించుకోవాలని సూచించారు.

యువతను తప్పుదోవ పట్టిస్తున్న అతిపెద్ద సామాజిక సమస్యల్లో డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం ప్రధానమని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. ఒకసారి మత్తు వ్యసనాలకు బానిసైతే వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు, కుటుంబ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. క్షణికానందం కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, చెడు అలవాట్లకు, చెడు స్నేహాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.

స్నేహితులను ఎన్నుకునే విషయంలో విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. మంచి స్నేహితులు జీవితాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తారని, చెడు స్నేహితులు జీవితాన్ని చీకట్లోకి నెట్టేస్తారని పేర్కొన్నారు. స్నేహం చేసే ముందు వారి ఆలోచనలు, అలవాట్లు, లక్ష్యాలను గమనించాలని సూచించారు. మహిళల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు.

"మీ భద్రత – మా బాధ్యత" కార్యక్రమం ద్వారా మహిళా రక్షక్ బృందాలను మరింత బలోపేతం చేసి మహిళలు, బాలికలు నిర్భయంగా విద్యను అభ్యసించే, ఉద్యోగాలు చేసే, స్వేచ్ఛగా సంచరించే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పారు. మహిళలపై వేధింపులు, ఈవ్‌టీజింగ్, సైబర్ వేధింపులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో సైబర్ నేరాల పట్ల కూడా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్లు, బ్యాంకు వివరాలు ఇతరులకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తెలియని వ్యక్తుల సందేశాలు, లింకులు, ఆన్‌లైన్ మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏవైనా అనుమానాస్పద సంఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారని

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story