Amalapuram: సముద్రంలో జాలర్ల గల్లంతు మంత్రి వాసంశెట్టి సుభాష్ సమీక్ష!

Amalapuram: కోనసీమ జిల్లా ఓడలరేవు జాలర్ల గల్లంతుపై స్పందించిన మంత్రి వాసంశెట్టి సుభాష్. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశం.

SURESH, AMALAPURAM
Published on: 18 Aug 2026 12:52 PM IST
Amalapuram
X

Amalapuram: సముద్రంలో జాలర్ల గల్లంతు మంత్రి వాసంశెట్టి సుభాష్ సమీక్ష!

Amalapuram: జాలర్ల గల్లంతు ఘటనపై మంత్రి వాసంశెట్టి సుభాష్ సమీక్ష.అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు, దమ్మలపేట,వాసలతిప్ప గ్రామాలకు చెందిన జాలర్లు బోటుతో సముద్రంలో గల్లంతైన ఘటనపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఉన్నతాధికారులతో సమీక్ష.

గల్లంతైన జాలర్ల ఆచూకీ కోసం చేపడుతున్న గాలింపు చర్యలపై మంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేసి,గల్లంతైన జాలర్లను వీలైనంత త్వరగా గుర్తించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్,ఆర్డీవోతో పాటు సంబంధిత ఉన్నతాధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు.సముద్రంలో గాలింపు చర్యలకు అవసరమైన సాంకేతిక,నౌకా సహాయం అందేలా సమన్వయం చేయాలని ఆదేశించారు.

మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.గాలింపు చర్యల్లో ఎలాంటి జాప్యం జరగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

గల్లంతైన జాలర్ల కుటుంబ సభ్యులకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు.జాలర్ల సురక్షిత ఆచూకీ కోసం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో చర్యలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story