Kesavadasupalem: కేశవదాసుపాలెంలో ఘనంగా పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు!

Kesavadasupalem: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కేశవదాసుపాలెంలో ఉచిత కంటి వైద్య శిబిరం, పేదలకు దుప్పట్ల పంపిణీ, బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.

PRABHU, RAZOLE
Published on: 2 Sept 2026 7:51 PM IST
Kesavadasupalem
X

Kesavadasupalem: కేశవదాసుపాలెంలో ఘనంగా పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు!

కేశవదాసుపాలెం: జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం కాలవమొగ సెంటర్‌లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

పాత ఆంధ్రా బ్యాంక్ పక్కన మేడిది విజయమోహన్ భవనం వద్ద పి.గన్నవరం వశిష్ట ప్రాథమిక కంటి ఆసుపత్రి ఆదిత్య ఆధ్వర్యంలో, కపిలేశ్వరం ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యుల సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 150 మందికి ఉచితంగా మందులు, కళ్లజోళ్లు పంపిణీ చేశారు. మరో 18 మందికి కంటి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించి, ఉచితంగా ఆపరేషన్లు చేయించేందుకు ఏర్పాట్లు చేశారు.

అలాగే జనసేన నాయకుల ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఓ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. పది మంది పేద కార్మికులకు లేబర్ ఇన్సూరెన్స్ పథకం వర్తించేలా డొనేషన్ చేశారు. డొక్కా సీతమ్మ పేరుతో పులిహోర పొట్లాలను పంపిణీ చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ జన్మదిన కేక్‌ను కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల పణికుమార్, డాక్టర్ రాపాక రమేష్ బాబు, పినిశెట్టి బుజ్జి, ఉండపల్లి అంజి, రాపాక మహేష్, జిల్లెళ్ల రక్షక్, ఎనుముల తాతాజీ, మేడిది విజయమోహన్, మెండు శ్రీను, బెల్లంకొండ ఆచార్యులు, పుత్రయ్య, అడబాల నాగేశ్వరరావు, లక్ష్మణ్, కొణిదెల రాజా, మండ కృష్ణ, చొప్పల మర్తయ్య, ముసునూరి రామారావు, కొల్లబత్తుల సోమరాజు తదితర జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, మెగా అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story