Amalapuram: అమలాపురం నర్సింగ్ హోమ్‌లో రూ. 6 కోట్ల భారీ కుంభకోణం!
Amalapuram: డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని చిరంజీవి నర్సింగ్ హోమ్‌లో భారీ గోల్‌మాల్ వెలుగుచూసింది. సిబ్బంది కళ్లుగప్పి సుమారు రూ. 6 కోట్లు
Amalapuram: అమలాపురం నర్సింగ్ హోమ్‌లో రూ. 6 కోట్ల భారీ కుంభకోణం!
Amalapuram: అమలాపురం చిరంజీవి నర్సింగ్ హోమ్ యాజమాన్యాన్ని నిలువునా ముంచిన సొంత సిబ్బంది సుమారు రూ.6 కోట్ల దాకా గోల్‌మాల్ చేసినట్లు ఆరోపణలు.రోగుల నుంచి వచ్చే IP,OP, ఫార్మసీ,ల్యాబ్ నగదును ఆసుపత్రి ఖాతాకు కాకుండా సొంత QR కోడ్లకు మళ్లించుకున్న కేటుగాళ్లు.
సంస్థను నమ్ముకుని విధులు అప్పగిస్తే వెన్నుపోటు పొడిచారంటూ యాజమాన్యం బండి సత్య రాధ పోలీసులకు ఫిర్యాదు.ఆసుపత్రి యాజమాన్యం ఫిర్యాదుతో క్రైమ్ నం.156/2026 కింద ఆరుగురు సిబ్బందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.
ప్రధాన నిందితురాలు విజయలక్ష్మి (A1),సువర్ణ రాజు (A2),రాజేష్ (A5)లను అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు.ఆసుపత్రిని మోసగించి పరారైన మరో ముగ్గురు సిబ్బంది కొల్లి శ్రీనివాసరావు,తాతాజీ,తొండా సురేష్‌ల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు.
మోసానికి పాల్పడిన నిందితుల ఫోన్‌పే యూపీఐ,బ్యాంక్ ఖాతాలు,ఆసుపత్రి రికార్డులపై పట్టణ సీఐ వీరబాబు ముమ్మర దర్యాప్తు.యాజమాన్యం కళ్లుగప్పి ఇంత భారీ దోపిడీకి పాల్పడిన వ్యవహారంలో అసలు కింగ్‌పిన్ ఎవరనే కోణంలో పోలీసులు ఆరా.




