Mamidikuduru: ఏపీజేఏసీ అమరావతి ఉద్యమంలో భాగంగా రెవెన్యూ సిబ్బంది నిరసన
Mamidikuduru: మామిడికుదురు తహశీల్దార్ కార్యాలయంలో ఏపీజేఏసీ అమరావతి ఉద్యమానికి మద్దతుగా రెవెన్యూ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు.
Mamidikuduru: ఏపీజేఏసీ అమరావతి ఉద్యమంలో భాగంగా రెవెన్యూ సిబ్బంది నిరసన
మామిడికుదురు: APJAC అమరావతి ఉద్యమ కార్యాచరణలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండల తహశీల్దార్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో రెవెన్యూ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు.
తహశీల్దార్ C.S. రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొని APJAC అమరావతి ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.
కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ K. శరణ్య, రిసర్వే డిప్యూటీ తహశీల్దార్, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ MD. ఇబ్రహీం, సీనియర్ సహాయకులు EVV సత్యనారాయణ, జూనియర్ సహాయకులు ప్రసాద్, ఆపరేటర్లు దుర్గ, రామకృష్ణ, VROలు, గ్రామ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
Next Story




