Mamidikuduru: మామిడికుదురులో ఘనంగా ఇమామ్ హసన్ సంతాప కార్యక్రమం
Mamidikuduru: మామిడికుదురులో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన మహమ్మద్ ప్రవక్త, హజరత్ ఇమామ్ హసన్ (రా) సంతాప కార్యక్రమం. పురవీధుల్లో కొనసాగిన గుమ్మటాల ఊరేగింపు.
Mamidikuduru: మామిడికుదురులో ఘనంగా ఇమామ్ హసన్ సంతాప కార్యక్రమం
మామిడికుదురు: ముస్లింల ఆరాధ్య ప్రవక్త మహమ్మద్ ప్రవక్త, హజరత్ ఇమామ్ హసన్ (రా) సంతాప కార్యక్రమాన్ని మామిడికుదురులో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా నగరం లోని బడే బీబీ పంజా నుంచి గుమ్మటాలను పురవీధుల్లో ఊరేగించారు.
మామిడికుదురు నుంచి నగరం లోని బడే బీబీ పంజా వరకు నిర్వహించిన ఊరేగింపులో మత ప్రబోధకులు అలీ జాఫరి మజిలీసులు ఆలపించారు. గుమ్మటాల వెంట మరిసియా, మార్షియా ఆలాపనలు కొనసాగాయి. పరహత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మార్షియా కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
పంజా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన సంతాప కార్యక్రమం సందర్భంగా పురవీధుల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
Next Story




