Mamidikuduru: మామిడికుదురులో నిండు శోకంతో మొహర్రం వేడుకలు
Mamidikuduru: మామిడికుదురు, నగరం గ్రామాల్లో మొహర్రం సంతాప కార్యక్రమాలు నిండు శోకంతో జరిగాయి.
Mamidikuduru: మామిడికుదురులో నిండు శోకంతో మొహర్రం వేడుకలు
మామిడికుదురు: ఇస్లాం చరిత్రలో కర్బలా యుద్ధంలో అపార ధైర్యసాహసాలు ప్రదర్శించిన హజరత్ అబ్బాస్‌కు భక్తులు ఘనంగా నివాళులర్పించారు. ఇమామ్ హుస్సేన్ సైనాధిపతిగా ఉన్న హజరత్ అబ్బాస్ తన వీర పరాక్రమంతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు.
అయితే, అహ్లెబైత్ నాయకులు యుద్ధానికి అనుమతి కోరినప్పటికీ, హజరత్ ఇమామ్ హుస్సేన్ పూర్తి స్థాయిలో యుద్ధానికి అనుమతి ఇవ్వలేదని మత పెద్దలు పేర్కొన్నారు. హజరత్ అబ్బాస్ తన సోదరుడు ఇమామ్ హుస్సేన్ ఆజ్ఞలను పాటిస్తూ కర్బలా యుద్ధంలో వీరమరణం పొందారని తెలిపారు.
ఈ సందర్భంగా హజరత్ అబ్బాస్ స్మారకంగా నిర్వహించిన పంజా, గుమ్మటం ఊరేగింపు భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. గురువారం మామిడికుదురు , నగరం వీధుల్లో గుమ్మటాన్ని ఊరేగిస్తూ ప్రత్యేక ప్రార్థనలు, మాతం కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ వేడుకలకు సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి పాల్గొన్నారు. భక్తుల రద్దీతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.




