Mamidikuduru: మామిడికుదురులో భక్తిశ్రద్ధలతో మొహర్రం మజిలీస్‌లు!

Mamidikuduru: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో మొహర్రం సంతాప వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.

PRABHU, RAZOLE
Published on: 24 Jun 2026 7:34 AM IST
Mamidikuduru
X

Mamidikuduru: మామిడికుదురులో భక్తిశ్రద్ధలతో మొహర్రం మజిలీస్‌లు!

మామిడికుదురు: మొహర్రం సంతాప కార్యక్రమాల్లో భాగంగా నగరం, మామిడికుదురు గ్రామాల్లోని బీబీ సకీనా, ఇమాంరజా, భాషూ పంజాల్లో మజిలీస్‌లు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కర్బలా యుద్ధంలో అమరుడైన హజరత్ ఇమామ్ హుస్సేన్ ఆరు నెలల పసికందు కుమారుడు అలీ అజ్గర్ జ్ఞాపకార్థం ప్రత్యేకంగా అలీ అజ్గర్ ఊయల ఊరేగింపును నిర్వహించారు. గ్రామాల వీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో భక్తులు మాతం పాటిస్తూ శ్రద్ధాంజలి ఘటించగా, దారి పొడవునా ఊయలకు మొక్కులు తీర్చుకున్నారు.

ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. మజిలీస్‌లో ప్రబోధకులు మొహమ్మద్ కాజుమే నజఫీ కర్బలా విషాద గాథతో పాటు హజరత్ అలీ అజ్గర్ త్యాగం గురించి వివరించగా భక్తులు భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం భాషూ పంజా పీరును ఘనంగా ఊరేగించారు. కడలి గ్రామం నుంచి తీసుకొచ్చిన పీరును నగరం గ్రామ వీధుల గుండా భక్తిశ్రద్ధలతో ప్రదర్శించగా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story