Mamidikuduru: మామిడికుదురులో మొహర్రం వేడుకలు
Mamidikuduru: మామిడికుదురు, నగరం గ్రామాల్లో మొహర్రం వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి.
Mamidikuduru: మామిడికుదురులో మొహర్రం వేడుకలు
మామిడికుదురు: ఇస్లాం చరిత్రలో కర్బలా యుద్ధంలో వీరత్వానికి ప్రతీకగా నిలిచిన హజరత్ అబ్బాస్‌కు భక్తులు ఘనంగా నివాళులర్పించారు. ఇమామ్ హుస్సేన్ సైన్యంలో సైన్యాధిపతిగా ఉన్న హజరత్ అబ్బాస్ కర్బలా క్షేత్రంలో అపారమైన ధైర్యసాహసాలు ప్రదర్శించారు. యుద్ధంలో అమరత్వం పొందిన ఆయన స్మారకార్థం మొహర్రం సందర్భంగా నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా హజరత్ అబ్బాస్ పంజా నుంచి గుమ్మటాన్ని ఊరేగిస్తూ భక్తులు మాతం నిర్వహించారు. గురువారం మామిడికుదురు ,నగరం గ్రామాలలోని పురవీధుల్లో గుమ్మటాన్ని ఊరేగించి ప్రత్యేక ప్రార్థనలు, పూజా కార్యక్రమాలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తుల ప్రార్థనలు, మాతం కార్యక్రమాలతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
Next Story




