Mamidikuduru: జామియా మసీదులో ఘనంగా మిలాద్‌ నబీ వేడుకలు

Mamidikuduru: మామిడికుదురు ఫతాన సున్ని జామియా మసీదులో మహమ్మద్‌ ప్రవక్త జయంతోత్సవం (మిలాద్‌ నబీ) సందర్భంగా కవి సమ్మేళనం, ఖురాన్‌ పఠనం ఘనంగా నిర్వహించారు.

PRABHU, RAZOLE
Published on: 26 Aug 2026 5:38 PM IST
Mamidikuduru
X

Mamidikuduru: జామియా మసీదులో ఘనంగా మిలాద్‌ నబీ వేడుకలు

మామిడికుదురు: మహమ్మద్‌ ప్రవక్త జయంతోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మామిడికుదురు లోని ఫతాన సున్ని జామియా మసీదులో మీలాద్‌ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మసీదు కమిటీ అధ్యక్షుడు మసూద్‌ మొహిద్దీన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మత ప్రబోధకుడు సాదిక్‌ అన్వర్‌ సారథ్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు కవులు మహమ్మద్‌ ప్రవక్త గొప్పతనాన్ని, బోధనలను కవితా రూపంలో వివరించారు. ఖురాన్‌ పఠనం, మతపరమైన కార్యక్రమాలతో భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. మసీదు ఆధ్వర్యంలో యాత్రికులకు పానీయాలు అందించారు.

కార్యక్రమంలో సంఘ నాయకులు ఆబిద్‌ అలీ, అబ్దుల్‌ కలాం, అలీ హుస్సేన్‌, అన్వర్‌ తాహిర్‌ హుస్సేన్‌, అలంధార్‌, పాషా మొహిద్దీన్‌, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story