Mamidikuduru: ఈనెల 18న 'మంజలే కర్బలా' మజ్లిస్.. విస్తృత ప్రచారం!

Mamidikuduru: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురులో ఈనెల 18న నిర్వహించనున్న జాగరణ, మంజలే కర్బలా మజ్లిస్ కార్యక్రమానికి నవయువకుల ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం.

PRABHU, RAZOLE
Published on: 14 Aug 2026 5:44 PM IST
Mamidikuduru
X

Mamidikuduru: ఈనెల 18న 'మంజలే కర్బలా' మజ్లిస్.. విస్తృత ప్రచారం!

Mamidikuduru: ముస్లింల పవిత్ర సంతాప కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 18న నిర్వహించనున్న జాగరణ కార్యక్రమానికి నవ యువకుల ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు గ్రామాల నుంచి హాజరయ్యే ముస్లిం సోదరులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

మామిడికుదురులో మంజలే కర్బలా మజ్లిస్‌ను నిర్వహించడంతో పాటు పెద్ద పంజిష్ వరకు ఊరేగింపు చేపట్టనున్నారు. మాతమ్ అనంతరం కర్బలా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించి ముస్లిం సంఘం అధ్యక్షులు ఆబేద్ అలీ, జనసేన నాయకులు ఖాసీం రజ్వీ తదితరులకు నిర్వాహకులు ప్రచారం నిర్వహించారు. కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, పటిష్టమైన ఏర్పాట్లతో నిర్వహించేందుకు నిర్వాహకులు చర్యలు చేపడుతున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story