Mamidikuduru: మామిడికుదురులో భక్తిశ్రద్ధలతో ఇమామ్ హుస్సేన్ అర్బఈన్!
Mamidikuduru: మామిడికుదురులో హజరత్ ఇమామ్ హుస్సేన్ అర్బఈన్ సంతాప కార్యక్రమాలు ప్రారంభం. ఒంటెలపై అమారీలతో ప్రత్యేక ఊరేగింపు, వేలాదిగా తరలివచ్చిన భక్తులు.
Mamidikuduru: మామిడికుదురులో భక్తిశ్రద్ధలతో ఇమామ్ హుస్సేన్ అర్బఈన్!
మామిడికుదురు: ఇస్లాం చరిత్రలో 61వ హిజ్రీ శకంలో జరిగిన కర్బలా విషాదాన్ని స్మరించుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురులో హజరత్ ఇమామ్ హుస్సేన్ అర్బఈన్ (అమరత్వం పొందిన 40వ రోజు) సందర్భంగా సంతాప కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి.
"గురుహే తాజ్దారే పురాత్" భక్త బృందం ఆధ్వర్యంలో సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులపాటు ప్రత్యేక మజిలీస్‌లు, సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. "మంజలే కర్బలా పంజా"లో జరుగుతున్న మజిలీస్‌లలో మత ప్రబోధకులు సయ్యద్ అంబర్ ఆబెది కర్బలా త్యాగగాథను, ఇమామ్ హుస్సేన్ సందేశాన్ని భక్తులకు వివరిస్తున్నారు.
మామిడికుదురులోని ఇమామ్ రజా పంజా నుంచి ఒంటెలపై అమారీలతో ప్రత్యేక ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు, మజిలీస్‌లలో పాల్గొనేందుకు జిల్లా నలుమూలలతో పాటు దూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి.




