Mamidikuduru: మామిడికుదురులో అర్బయిన్ కార్యక్రమాల ప్రచారం

Mamidikuduru: హజరత్ ఇమామ్ హుస్సేన్ స్మరణార్థం మామిడికుదురులో ఆగస్టు 3, 4, 5 తేదీల్లో అర్బయిన్. గురుహై తాజదారే పురాత్ బృందం ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం.

PRABHU, RAZOLE
Published on: 31 July 2026 5:35 PM IST
Mamidikuduru
X

Mamidikuduru: మామిడికుదురులో అర్బయిన్ కార్యక్రమాల ప్రచారం

మామిడికుదురు: అమరజీవి హజరత్ ఇమామ్ హుస్సేన్ 40వ రోజు స్మరణార్థం నిర్వహించే అర్బయిన్ కార్యక్రమాల ప్రచారం మామిడికుదురు , నగరంలో ముమ్మరంగా సాగుతోంది. ఆగస్టు 3, 4, 5 తేదీలలో నిండు శోకంతో అర్బయిన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

"గురుహై తాజదారే పురాత్" భక్త బృందం ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టి భక్తులను ఆహ్వానిస్తున్నారు. కార్యక్రమాలకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. మామిడికుదురు, కొమరాడ, మొగలికుదురు గ్రామాల్లో ప్రచారం నిర్వహించి, ఇతర జిల్లాలు మరియు రాష్ట్రాల భక్తులను కూడా అర్బయిన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భక్త బృందం పిలుపునిచ్చింది.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story