Mamidikuduru: అంబేడ్కర్‌ను అవమానించిన వారిపై దేశద్రోహం కేసు పెట్టాలి
Mamidikuduru: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించిన హమారా ప్రసాద్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కోరుతూ మామిడికుదురులో దళితులు నిరసన తెలిపి, అధికారులకు వినతిపత్రం అందజేశారు.
Mamidikuduru: అంబేడ్కర్‌ను అవమానించిన వారిపై దేశద్రోహం కేసు పెట్టాలి
మామిడికుదురు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించేలా కల్పిత రచనలు చేసిన హమారా ప్రసాద్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని దళితులు డిమాండ్ చేశారు. గురువారం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు సెంటర్‌లో హమారా ప్రసాద్ చిత్రపటాన్ని చెప్పులతో కొడుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
అంబేడ్కర్‌ను అవమానించే విధంగా వ్యవహరించడం దళితుల మనోభావాలను దెబ్బతీయడమేనని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హమారా ప్రసాద్ తీరును తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేశారు. అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు, రచనలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్, ఎస్సైలకు వినతిపత్రాన్ని అందజేశారు.
కార్యక్రమంలో కలిగితి పల్లంరాజు, నెల్లి దుర్గాప్రసాద్, బొంతు మణిరాజు, కొల్లాబత్తుల మున్నా తదితరులు పాల్గొన్నారు.




