Mamidikuduru: మామిడికుదురు నూకాలమ్మ అమ్మవారికి ఘనంగా ఆషాఢ సారె!

Mamidikuduru: మామిడికుదురు శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా వైభవంగా సారె సమర్పణ. ఆలయానికి పోటెత్తిన భక్తులు, ప్రత్యేక క్యూలైన్లలో దర్శనాలు.

PRABHU, RAZOLE
Published on: 2 Aug 2026 2:40 PM IST
Mamidikuduru
X

Mamidikuduru: మామిడికుదురు నూకాలమ్మ అమ్మవారికి ఘనంగా ఆషాఢ సారె!

మామిడికుదురు: మండల కేంద్రం మామిడికుదురులో కొలువుదీరిన శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆదివారం ఆషాఢ మాసం సందర్భంగా సంప్రదాయబద్ధంగా సారె సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

పరిసర ప్రాంతాలతో పాటు మండలంలోని ప్రతి ఇంటి నుంచి పెద్ద ఎత్తున హిందూ భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులను సమర్పించారు. "నూకాలమ్మ అమ్మవారికి జై" అంటూ భక్తులు భక్తి నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు.

మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శన ఏర్పాట్లు చేసి సజావుగా నిర్వహించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story