Malikipuram: బాధితులకు అండగా వసుధ ఫౌండేషన్ రూ.24 వేల ఆర్థిక సాయం పంపిణీ!

Malikipuram: మలికిపురంలో వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ముగ్గురికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.24 వేల ఆర్థిక సాయం అందజేత.

PRABHU, RAZOLE
Published on: 16 Aug 2026 1:08 PM IST
Malikipuram
X

Malikipuram: బాధితులకు అండగా వసుధ ఫౌండేషన్ రూ.24 వేల ఆర్థిక సాయం పంపిణీ!

Malikipuram: అనారోగ్యంతో బాధపడుతున్న ముగ్గురికి వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొత్తం రూ.24 వేల ఆర్థిక సాయం అందించారు. డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం, మలికిపురం లో వసుధ ఫౌండేషన్ కన్వీనర్ జంపన బుజ్జిరాజు ఇంటి వద్ద ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించారు.

వైద్య ఖర్చుల నిమిత్తం వి.వి.మెరకకు చెందిన చెవ్వాకుల పాపయమ్మకు రూ.10 వేలు, గొల్లపాలెంకు చెందిన వడ్డీ శ్రీనివాస్‌కు రూ.7 వేలు, దిండి గ్రామానికి చెందిన ముప్పిరి వెంకటరెడ్డికి రూ.7 వేల చొప్పున వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా బాధితుల కుటుంబ సభ్యులు వసుధ ఫౌండేషన్ చైర్మన్ (హైదరాబాద్) మంతెన రామరాజు, కన్వీనర్ జంపన బుజ్జిరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బోనం రాజు, రాపాక చిన్ని, విజ్జేశ్వరపు అరుణ్‌కుమార్, ముప్పిరి సందీప్ తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story