Malikipuram: మలికిపురంలో టిడిపి ఇంటింటా ప్రచారం ప్రభుత్వ సంక్షేమ వివరణ!
Malikipuram: కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై మలికిపురంలో టిడిపి ఇంటింటా ప్రచారం. పాల్గొన్న గంధం పల్లంరాజు, గొల్లపల్లి అమూల్య.
Malikipuram: మలికిపురంలో టిడిపి ఇంటింటా ప్రచారం ప్రభుత్వ సంక్షేమ వివరణ!
Malikipuram: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు స్థానిక సమస్యలను తెలుసుకునే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం గ్రామంలో ఆదివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
మలికిపురం గ్రామశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్య పాల్గొని పలు గృహాలను సందర్శించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు జంపన సత్యనారాయణ రాజు, అడబాల రమాదేవి శేషారావు, గుత్తుల ఉమామహేశ్వరరావు, కంచి జగదీష్, ఓగూరి సూరిబాబు, కౌరు శ్రీను, కడలి వెంకటరత్నం, కోళ్ల పండు, కొల్లబత్తుల కుమార్, ఒగ్గు నాని, తాడి రాము, బొక్కా గోవింద్, దాట్ల శ్రీనివాసరాజు, అల్లూరి శరత్ రాజు, భూపతి ప్రసాద్, కడలి సత్యనారాయణ, కడలి సాయి, బొక్కా పృద్వి, చిక్కా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.




