Malikipuram: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరిన రాజేశ్వరి దేవి!

Malikipuram: మలికిపురంలో మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి ఆధ్వర్యంలో YSRCP రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. DSC-2025 అక్రమాలపై సీబీఐ విచారణ డిమాండ్ చేశారు.

PRABHU, RAZOLE
Published on: 6 Aug 2026 3:33 PM IST
Malikipuram
X

Malikipuram: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరిన రాజేశ్వరి దేవి!

DSC–2025 అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి

మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్

మలికిపురం: DSC–2025 ఉపాధ్యాయ నియామకాల్లో చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్న అక్రమాలు, అవకతవకలపై సమగ్ర సీబీఐ విచారణ చేపట్టాలని, రాజకీయ బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం, మలికిపురం సెంటర్ లోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గురువారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.

రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి ఆధ్వర్యంలో తొలి రోజు దీక్ష నిర్వహించారు. యువత, విద్యార్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

DSC నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై ప్రభుత్వం పారదర్శక విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అభ్యర్థులకు న్యాయం చేయాలని వారు కోరారు. సీబీఐ విచారణ జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story