Malikipuram: చింతలమోరి రామాలయంలో వినాయక చవితి వేడుకలు!
Malikipuram: మలికిపురం చింతలమోరి రామాలయంలో వినాయక చవితి వేడుకలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు దంపతులు.
Malikipuram: చింతలమోరి రామాలయంలో వినాయక చవితి వేడుకలు!
Malikipuram: మలికిపురం రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం చింతలమోరి (బీచ్ నగర్) రామాలయం వద్ద వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి మాజీ శాసనసభ్యులు శ్రీ రాపాక వరప్రసాదరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పుష్పాలు సమర్పించి, కొబ్బరికాయ కొట్టి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాపాక వరప్రసాదరావు దంపతులు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సమృద్ధి కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.




