Doha: దోహా ఖతర్‌లో ఘనంగా మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు

Doha: దోహాలోని న్యూ సలాత్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు 51వ పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE
Published on: 9 Aug 2026 11:06 AM IST
Doha
X

Doha: దోహా ఖతర్‌లో ఘనంగా మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు

దోహా ఖతర్‌లో ఘనంగా మహేష్ బాబు 51వ పుట్టినరోజు వేడుకలు

దోహా, ఖతర్: సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు 51వ పుట్టినరోజు వేడుకలను దోహా ఖతర్‌లోని న్యూ సలాత్‌లో పితాని శ్రీను విల్లాలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. రాపాక సూర్య ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్‌సీపీ దోహా ఖతర్ కన్వీనర్ జాఫర్ హుస్సేన్, పితాని శ్రీను, మనీష్ రెడ్డి, బాబు సికోలు, కండి బోయిన ఫణి, కిషోర్, కారుపల్లి రాజు, చిన్నం చందు, దిడ్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహేష్ బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానుల సందడి మధ్య వేడుకలు ఉత్సాహంగా సాగాయి.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story