Magatapalli: మగటపల్లిలో 'ఇంటింటికి టీడీపీ' – నామన రాంబాబు హామీ!
Magatapalli: మామిడికుదురు మండలం మగటపల్లిలో 'ఇంటింటికి టీడీపీ' కార్యక్రమం. మాజీ జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు పాల్గొని స్థానిక సమస్యలపై ప్రజలకు భరోసా.
Magatapalli: మగటపల్లిలో 'ఇంటింటికి టీడీపీ' – నామన రాంబాబు హామీ!
మగటపల్లి: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం, మగటపల్లి గ్రామంలోని 197వ బూత్‌లో బూత్ కన్వీనర్ నామన ఆంజనేయ స్వామి నాయుడు ఆధ్వర్యంలో 'ఇంటింటికి టీడీపీ – రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం' కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నామన రాంబాబు హాజరయ్యారు. ఆయన గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అందుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. అలాగే గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాలు, స్థానిక సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇస్తూ వారికి భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నామన నాగేశ్వరరావు, టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు కుంపట్ల బాబ్జి, యూనిట్ ఇన్‌చార్జి కుంచే శ్రీనివాస్, బూత్ కన్వీనర్ బొంతు రవివర్మ, బోలిశెట్టి నాగభూషణం, నామన శ్రీనివాస్, సరెళ్ల సత్యనారాయణ, భూపతి శ్రీనివాస్, యలంగి ప్రసాద్, గుబ్బల మురళి, నామన నానారు, మందపాటి రాము, వడ్లపాటి పెద్దిరాజు, మహమ్మద్ సమీద్ బాషా తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




