Razole: రాజోలులో 'లెనిన్' సినిమా టికెట్ల దోపిడీ అభిమానుల ఆగ్రహం!

Razole: రాజోలులో 'లెనిన్' సినిమా టికెట్లను నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు అమ్ముతుండటంపై సినీ అభిమానులు, ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

PRABHU, RAZOLE
Published on: 9 July 2026 11:11 AM IST
Razole
X

Razole: రాజోలులో 'లెనిన్' సినిమా టికెట్ల దోపిడీ అభిమానుల ఆగ్రహం!

రాజోలు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలోని పలు సినిమా థియేటర్లలో శుక్రవారం విడుదల కానున్న లెనిన్ సినిమా టికెట్లను నిర్ణీత ధర కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం నుంచి టికెట్ ధరల పెంపునకు ఎలాంటి అనుమతి లేకపోయినా, రూ.100 ఉండాల్సిన టికెట్‌ను ఆన్‌లైన్‌లో రూ.150 వరకు విక్రయిస్తూ ప్రేక్షకుల నుంచి అదనపు మొత్తాన్ని వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా థియేటర్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, దీంతో సామాన్య ప్రేక్షకులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని సినీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.

టికెట్ ధరలపై సంబంధిత అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లను విక్రయించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే అక్రమ వసూళ్లను అరికట్టేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి, నిబంధనలు ఉల్లంఘించే థియేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story