Mummidivaram: లంక గ్రామాలను వెంటాడుతున్న వరద ముప్పు!
Mummidivaram: ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాల్లోని లంక గ్రామాలకు పెరుగుతున్న వరద ముప్పు.
Mummidivaram: లంక గ్రామాలను వెంటాడుతున్న వరద ముప్పు!
Mummidivaram: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద నీటితో గోదావరి ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ముమ్మిడివరం మండలంలోని పలు లంక గ్రామాల్లో వరద ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇప్పటికే కొన్ని గ్రామాల్లో రహదారులపైకి వరదనీరు చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరద నీటి మట్టం మరింత పెరిగితే కొన్ని లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, లంక గ్రామాల్లో నిల్వ చేసిన కొబ్బరికాయలను, వ్యవసాయ అవసరాల కోసం పంట పొలాల వద్ద ఉంచిన డీజిల్ ఇంజిన్లను రైతులు సురక్షితమైన మెరక ప్రాంతాలకు తరలిస్తున్నారు.వరద ప్రభావంతో నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ముఖ్యంగా ముమ్మిడివరం మండలంలోని లంకాఫ్ ఠాణేలంక, గురజాపులంక, కూనాలంక, గేదెల్లంక గ్రామాలతో పాటు, ఐ. పోలవరం మండలంలోని సలాదివారిపాలెం, శేరిలంక, గోగుల్లంక, పొగాకులంక తదితర లంక గ్రామాలు వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి.




