P Gannavaram: మానేపల్లిలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’: పాల్గొన్న మంత్రి!
P Gannavaram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం మానేపల్లిలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో పాల్గొన్నారు.
P Gannavaram: మానేపల్లిలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’: పాల్గొన్న మంత్రి!
పి గన్నవరం: పి గన్నవరం మండలం మానేపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. మానేపల్లి గ్రామానికి గతంలో బస్సు సౌకర్యం ఉండేదని గత కొంతకాలంగా దానిని నిలిపివేశారని ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి త్వరలోనే మీ గ్రామానికి బస్సు వస్తుందని హామీ ఇచ్చారు.
అంతేకాకుండా మా గ్రామంలో డ్రైనేజ్ లు లేవని సమస్య ఎక్కువగా ఉందని మంత్రికి విన్నవించారు. మంత్రి మాట్లాడుతూ ఈ రెండు సంవత్సరాలు కాలంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చమని చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా అర్హులైన అభ్యర్థులకు 25 వేల రూపాయలు అందించామని మంత్రి అన్నారు. గొడ్డలి పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరకాలంలో దోచుకోవడమే తప్ప చేసిందేమీ లేదని ప్రజలను చాలా ఇబ్బంది పెట్టారని రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేశారని అన్నారు.
మా పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ రెండు సంవత్సరాలు కాలంలో విదేశీ పెట్టుబడులు రాష్ట్రం వైపు చూస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




