Ramachandrapuram: గౌతమి గోదావరికి వరద.. పంటు ప్రయాణం నిలిపివేత!
Ramachandrapuram: కోనసీమలో గౌతమి గోదావరి వరద ఉధృతి పెరగడంతో కోటిపల్లి-ముక్తేశ్వరం మధ్య పంటు ప్రయాణాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
Ramachandrapuram: గౌతమి గోదావరికి వరద.. పంటు ప్రయాణం నిలిపివేత!
అంబేద్కర్ కోనసీమ జిల్లా...రామచంద్రపురం
కోటిపల్లి వద్ద గౌతమి గోదావరినది వరద ఉధృతి కారణంగా కోటిపల్లి - ముక్తేశ్వరం పంటి ప్రయాణం నిలిపివేత
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నది ప్రవాహం తీవ్రతరమైంది.
ఈ ప్రవాహ తీవ్రత దృష్ట్యా, కోటిపల్లి - ముక్తేశ్వరం రేవుల మధ్య నడిచే పంటు ప్రయాణాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు...
కోటిపల్లి మీదుగా అమలాపురం వెళ్లే ప్రయాణికులకు రాకపోకలు నిలిచిపోయాయి. అమలాపురం వైపు వెళ్లాల్సిన ప్రయాణికులు యానాం బ్రిడ్జి మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Next Story




