Kothapeta: కొత్త పెన్షన్ల కోసం రాత్రి 10 గంటల వరకు అవిడి సచివాలయ సిబ్బంది సేవలు

Kothapeta: కొత్త పింఛన్ల దరఖాస్తు గడువు దగ్గరపడుతుండటంతో కొత్తపేట మండలం అవిడి సచివాలయం సిబ్బంది రాత్రి 10 గంటల వరకు పనిచేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Sept 2026 7:01 PM IST
Kothapeta
X

Kothapeta: కొత్త పెన్షన్ల కోసం రాత్రి 10 గంటల వరకు అవిడి సచివాలయ సిబ్బంది సేవలు

కొత్తపేట: ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్లు, వికలాంగ పింఛన్లు కొరకు అర్హులైన ప్రతి ఒక్కరు తమ తమ గ్రామ సచివాలయాల్లో సంబంధిత పత్రాలను సంబంధిత అధికారులకు అందజేసి పెన్షన్ కొరకు అప్లై చేసుకోవాల్సిందిగా ప్రఘటన న విడుదల చేయడం జరిగింది.

గడువు తేదీ ఈ నెల 16 కావడంతో, పెన్షన్ దారులు ఎక్కువ మొత్తంలో అప్లై చేయడంతో, సమయానికి ఇంటర్నెట్ సరిగా పని చెయ్యలేకపోవడంతో అప్లికేషన్లు ఎక్కువ రావడంతో, కొత్తపేట మండలం అవిడి గ్రామం సచివాలయం 1 వెల్ఫేర్ అసిస్టెంట్ వరప్రసాద్ సచివాలయం 2 డిజిటల్ వెల్ఫేర్ అసిస్టెంట్, సత్సేన్ రాత్రి 10 గంటల వరకు పనిచేయవలసి అవసరం వస్తుంది.

ఈ కార్యక్రమంలో సచివాలయ సెక్రెటరీ వరప్రసాద్ పెన్షన్ దారులకు ఇబ్బంది కలగకుండా వారికి కూర్చోవడానికి సదుపాయం కల్పిస్తూ తాగునీరు ఎప్పటికప్పుడు అందిస్తూ దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్