Nagaram: ZPHS పాత విద్యార్థుల ఉదారత.. పాఠశాలలో సైకిల్ స్టాండ్ నిర్మాణం!

Nagaram: కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం జెడ్పీహెచ్‌ఎస్ 1976-77 పాత విద్యార్థులు రూ.40 వేలతో సైకిల్ స్టాండ్ నిర్మించి పాఠశాలకు బహుకరించారు.

PRABHU, RAZOLE
Published on: 26 Aug 2026 5:35 PM IST
Nagaram
X

Nagaram: ZPHS పాత విద్యార్థుల ఉదారత.. పాఠశాలలో సైకిల్ స్టాండ్ నిర్మాణం!

Nagaram: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థుల సౌకర్యార్థం పాత విద్యార్థులు ముందుకు వచ్చి సైకిల్ స్టాండ్ నిర్మించారు. 1976–77 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలో చదివిన పాత విద్యార్థులు తమ వంతు సహకారంగా రూ.40 వేల నగదును స్పాన్సర్ చేశారు. ఆ నిధులతో పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు సైకిళ్లు పెట్టుకునేందుకు సైకిల్ స్టాండ్‌ను నిర్మించారు.

ప్రతిరోజూ పాఠశాలకు సైకిళ్లపై వచ్చే విద్యార్థులు వాటిని ఎక్కడ పడితే అక్కడ ఉంచాల్సిన ఇబ్బందులు ఎదుర్కొనేవారు. సైకిల్ స్టాండ్ నిర్మాణంతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాత విద్యార్థులు ఆర్థిక సహకారం అందించడం పట్ల పాఠశాల సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి పాత విద్యార్థులు సహకరించడం అభినందనీయమని, భవిష్యత్తులో కూడా పాఠశాల అవసరాలకు తమ వంతు సహకారం అందించాలని పాఠశాల సిబ్బంది కోరారు. పాత విద్యార్థుల సహకారం ఇతరులకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story