Malikipuram: వంతెనపై బైక్, లేఖ.. కోనసీమలో యువకుడు అదృశ్యం!
Malikipuram: సఖినేటిపల్లిలంకకు చెందిన తరుణ్‌కుమార్ అదృశ్యం. దిండి-చించినాడ వంతెన వద్ద బైక్, లెటర్ లభ్యం కావడంతో కుటుంబ సభ్యుల తీవ్ర ఆందోళన.
Malikipuram: వంతెనపై బైక్, లేఖ.. కోనసీమలో యువకుడు అదృశ్యం!
మలికిపురం: డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, సఖినేటిపల్లిలంక గ్రామానికి చెందిన దారపురెడ్డి తరుణ్‌కుమార్ (22) అదృశ్యమయ్యాడు. సోమవారం ఉదయం మలికిపురంలోని షాపులో పనిచేసేందుకు వెళ్లిన తరుణ్‌కుమార్ ఆ తర్వాత కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తరుణ్‌కుమార్ తన బైక్‌ను దిండి - చించినాడ బ్రిడ్జి వద్ద ఉంచి, ఓ లేఖను అక్కడ వదిలి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై మలికిపురం పోలీస్‌స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
తరుణ్‌కుమార్ ఎలాంటి క్షణికావేశ నిర్ణయం తీసుకోకుండా క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు. ఆచూకీ తెలిసిన వారు వెంటనే మలికిపురం పోలీసులకు లేదా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.




