Mamidikuduru: మామిడికుదురులో ఘనంగా 'ఊయల ఊరేగింపు'

Mamidikuduru: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురులో నిండు శోక వాతావరణంలో ఘనంగా జరిగిన హజరత్ అలీ అస్గర్ ఊయల ఊరేగింపు.

PRABHU, RAZOLE
Published on: 5 Aug 2026 7:31 PM IST
Mamidikuduru
X

Mamidikuduru: మామిడికుదురులో ఘనంగా 'ఊయల ఊరేగింపు'

మామిడికుదురు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురులో అర్బయిన్ కార్యక్రమాల సందర్భంగా బుధవారం నిండు శోక వాతావరణంలో 'ఊయల ఊరేగింపు' నిర్వహించారు.

కర్బలా చరిత్రలో ప్రముఖ ఘట్టమైన హజరత్ ఇమామ్ హుసేన్ తనయుడు, ఆరు నెలల పసికందు హజరత్ అలీ అస్గర్ అమరత్వాన్ని స్మరించుకుంటూ ముస్లిం భక్తులు ఘనంగా నివాళులర్పించారు. నగరం లోని పెద్ద పంజిషా నుంచి మంజుల కర్బలా వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఊయలను ఊరేగింపుగా తీసుకెళ్లారు.

ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. చిన్నారులతో కలిసి కుటుంబ సమేతంగా భక్తులు తరలివచ్చి ప్రార్థనలు నిర్వహించారు. "గురుహే తాజదారే పురత్" భక్త బృందం ఆధ్వర్యంలో మతపరమైన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story