Malikipuram: సఖినేటిపల్లి ఎస్‌బీఐ గోల్డ్ లోన్ బాధితులకు పరిహారం చెక్కుల పంపిణీ

Malikipuram: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి ఎస్‌బీఐ గోల్డ్ లోన్ కుంభకోణ బాధితులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్.

PRABHU, RAZOLE
Published on: 7 Aug 2026 2:41 PM IST
Malikipuram
X

Malikipuram: సఖినేటిపల్లి ఎస్‌బీఐ గోల్డ్ లోన్ బాధితులకు పరిహారం చెక్కుల పంపిణీ

మలికిపురం: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి ఎస్‌బీఐ బ్యాంకులో ఆరు సంవత్సరాల క్రితం జరిగిన గోల్డ్ లోన్ కుంభకోణంలో నష్టపోయిన బాధితులకు న్యాయం చేసే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కృషి ఫలితంగా బ్యాంకు అధికారులు బాధితులకు పరిహారం చెల్లింపులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఐదుగురు బాధితులకు చెక్కులను అందజేశారు. మొత్తం 72 గోల్డ్ లోన్లలో 59 మంది బాధితులు అర్హులుగా గుర్తించబడగా, తొలి విడతలో ఐదుగురికి ప్రస్తుత బంగారం మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.35 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అలాగే తరుగు, మజూరీ, జీఎస్టీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని బంగారం విలువపై అదనంగా 20 శాతం మొత్తాన్ని కూడా చెల్లించారు.

చెక్కులు అందుకున్న బాధితులు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్య పరిష్కారమై న్యాయం జరగడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ, మిగిలిన 54 మంది బాధితులకు కూడా ఆగస్టు నెలాఖరు నాటికి పరిహారం చెల్లింపులు పూర్తి చేయాలని ఎస్‌బీఐ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. బాధితులందరికీ పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఈ సమస్య పరిష్కారంలో సహకరించిన ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్ శ్రీ అశోక్ నాగరాజన్, సఖినేటిపల్లి బ్రాంచ్ మేనేజర్ శ్రీ రాజు సేవలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story