Mamidikuduru: మామిడికుదురులో ఆకట్టుకుంటున్న అరుదైన పుంగనూరు పెయ్యి దూడ
Mamidikuduru: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురులో 18 అంగుళాల ఎత్తుతో అరుదైన పుంగనూరు పెయ్యి దూడ జన్మించింది దీని విలువ రూ.2.50 లక్షలని తెలిపారు
Mamidikuduru: మామిడికుదురులో ఆకట్టుకుంటున్న అరుదైన పుంగనూరు పెయ్యి దూడ
Mamidikuduru: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురులో అరుదైన పుంగనూరు పెయ్యి దూడ జన్మించడం స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది. గ్రామానికి చెందిన ప్రముఖ రైతు నయనాల రామకృష్ణకు చెందిన దేశవాళీ ఆవు మూడో ఈతలో గురువారం ఈ అరుదైన దూడకు జన్మనిచ్చింది.
ప్రపంచంలోనే అత్యంత పొట్టి జాతుల్లో ఒకటిగా పేరొందిన పుంగనూరు జాతికి చెందిన ఈ దూడ కేవలం 18 అంగుళాల ఎత్తు ఉండటం విశేషం. ముద్దులొలికే ఈ చిట్టి దూడను చూసేందుకు స్థానికులు ఆసక్తిగా తరలివచ్చారు.
అంతరించిపోతున్న విశిష్ట దేశవాళీ పుంగనూరు జాతికి చెందిన ఈ దూడకు ప్రస్తుతం మార్కెట్‌లో సుమారు రూ.2.50 లక్షల వరకు విలువ ఉంటుందని రైతు నయనాల రామకృష్ణ తెలిపారు. తమ పాకలో లక్ష్మీదేవి అడుగుపెట్టినట్లుగా ఉందంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.




