Amalapuram: పవర్ లిఫ్టింగ్‌లో కోనసీమ ప్రతిభ విజేతలకు సన్మానం!

Amalapuram: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో అర్హత సాధించిన నేషనల్ జడ్జీలు నరేష్, గణేష్ బాబులతో పాటు స్వర్ణ విజేత అప్పన్నకు అమలాపురంలో ఘన సత్కారం.

SURESH, AMALAPURAM
Published on: 6 Sept 2026 12:17 PM IST
Amalapuram
X

Amalapuram: పవర్ లిఫ్టింగ్‌లో కోనసీమ ప్రతిభ విజేతలకు సన్మానం!

Amalapuram: కోనసీమ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ పవర్ లిఫ్టింగ్ ఇండియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన టెస్ట్ లో నేషనల్ జడ్జెస్ క్యాటగిరి రెండు గా అర్హత సాధించిన కోనసీమ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరుపున జరిగిన పోటీలలో విజయంలు సాధించరు.ఈ నేషనల్ క్వాలిఫైడ్ జడ్జెస్ లో విజయాలు సాదించిన వారిలో వి.నరేష్,జి.గణేష్ బాబు మరియు ఏ.పీ పోలీస్ పవర్ లిఫ్టింగ్ పోటీలు గోల్డ్ మెడల్ విజేత బి.అప్పన్న కు ఘన సత్కారము చేసిన అసోసియేషన్ కమిటీ సభ్యులు.

కోనసీమ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఇటీవల ఖాజీపూర్ ( ఉత్తర ప్రదేశ్ ) లో జరిగిన పవర్ లిఫ్టింగ్ ఇండియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన టెస్ట్ లో నేషనల్ జడ్జెస్ క్యాటగిరి 2 గా అర్హత సాధించిన కోనసీమ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు వాసంశెట్టి నరేష్,గుబ్బల గణేష్ బాబు మరియు ఇటీవల అమరావతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 540 కేజీల రికార్డు బరువు ఎత్తి గోల్డ్ మెడల్ సాధించిన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళం కానిస్టేబుల్ హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ పవర్ లిప్టర్ బి.అప్పన్నకు ఈరోజు హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ నందు కోనసీమ పవర్ లిప్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎనుముల కృష్ణ పద్మరాజు గారు అధ్యక్షతన వీరి ముగ్గురికి ఘనంగా సత్కరించి, అభినందించారు. ప్రతి ఒక్కరు శరీర దృఢత్వానికి మానసిక ఆనందానికి తద్వారా జీవితంలో స్థిరపడటానికి క్రీడలు దోహదం చేస్తాయని పద్మరాజు తెలిపారు.

ఈ అభినందన ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనవారు ఎం.వి.సముద్రం, ముమ్మిడి ప్రతాప్( దివ్య తేజ విద్యానికేతన్ ),ఎల్. సత్యనారాయణ, మేకల కిషోర్, వాకా గోపి,కర్రీ ప్రసాద్, గంగుమళ్ళ దొరబాబు,సంసాని ఉదయ్ భాస్కర్,తరుణ్, అక్కల వెంకటరావు,జగదీశ్వర్ మరియు హెల్త్ అండ్ ఫిట్నెస్ మెంబర్స్ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారని కోచ్ కంకిపాటి వెంకటేశ్వరరావు తెలిపారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story