Mamidikuduru: నగరంలో భక్తిశ్రద్ధలతో మొహరం సంతాప కార్యక్రమాలు!
Mamidikuduru: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా నగరంలో బీబీ సకినా పంజా వద్ద మొహరం మజిలీస్ కార్యక్రమాలు.
Mamidikuduru: నగరంలో భక్తిశ్రద్ధలతో మొహరం సంతాప కార్యక్రమాలు!
Mamidikuduru: మొహరం సంతాప కార్యక్రమాల్లో భాగంగా డాక్టర్. బీఆర్ .అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం, నగరంలోని బీబీ సకినా పంజాలో మజిలీస్ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్త బృందం "గురుహై తాజ్‌దారే వఫా" ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మత ప్రబోధకులు మహమ్మద్ హాఫీజ్ రజారజివి మజిలీస్‌ను ఆలపించి, హజరత్ ఇమామ్ హుసేన్ తనయురాలు బీబీ సకీనా జీవిత చరిత్ర, ఆమె త్యాగం, కర్బలా విషాద గాథను భక్తులకు వివరించారు.
అనంతరం బీబీ సకినా పీరును గుర్రంపై ఊరేగిస్తూ మాతం నిర్వహించారు. భక్తులు రక్తాన్ని చిందిస్తూ తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి దూర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మహిళా భక్తుల పాల్గొనడం విశేషంగా నిలిచింది. అలాగే షియా మసీదులో "నవ యువకుల బృందం" ఆధ్వర్యంలో తొలి మజిలీస్ కార్యక్రమం నిర్వహించారు. మొహరం సందర్భంగా నిర్వహించిన ఈ సంతాప కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.




