Keshanapalli: కేశనపల్లి పీహెచ్‌సీ పల్లిపాలెంలో డెంగ్యూపై అవగాహన ర్యాలీ

Keshanapalli: కోనసీమ జిల్లా మలికిపురం మండలం జీ. పల్లిపాలెంలో కేశనపల్లి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో డెంగ్యూ నివారణ అవగాహన ర్యాలీ నిర్వహించారు.

PRABHU, RAZOLE
Published on: 9 July 2026 11:50 AM IST
Keshanapalli
X

Keshanapalli: కేశనపల్లి పీహెచ్‌సీ పల్లిపాలెంలో డెంగ్యూపై అవగాహన ర్యాలీ

Keshanapalli: డెంగ్యూ మాసోత్సవాల సందర్భంగా ఎస్‌యూఓ ఆదేశాల మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం, కేశనపల్లి పీహెచ్‌సీ పరిధిలోని జి. పల్లిపాలెం గ్రామంలో డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని ఎంపీహెచ్‌ఈఓ చంటి ఆధ్వర్యంలో నిర్వహించగా, మేల్ హెల్త్ అసిస్టెంట్లు ఎస్. శ్రీరామ్ మూర్తి, శివకుమార్, గంగరాజు (ఎంఎస్‌హెచ్‌పీ), ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం "ఫ్రైడే డ్రైడే" పాటిస్తూ నీటి నిల్వలను తొలగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, దోమతెరలను వినియోగించాలని అవగాహన కల్పించారు.

అనంతరం ఆరోగ్య నియమాలు, వ్యాధి నివారణ చర్యలపై వివరించి ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. జ్వరం వచ్చిన వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి వైద్య సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story