Goggannamatham: తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న డాక్టర్ మురళీకృష్ణ

Goggannamatham: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా గోగన్నమఠానికి చెందిన డాక్టర్ పెనుమాల మురళీకృష్ణకు తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది.

PRABHU, RAZOLE
Published on: 6 Sept 2026 6:59 PM IST
Goggannamatham
X

Goggannamatham: తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న డాక్టర్ మురళీకృష్ణ

గోగన్నమఠం: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం, గోగన్నమఠం గ్రామానికి చెందిన డాక్టర్ పెనుమాల మురళీకృష్ణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందజేసింది.

ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్థికశాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు కళాశాల అభివృద్ధి, సామాజిక బాధ్యత పెంపొందించే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఆయన సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

మురళీకృష్ణకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం పట్ల గోగన్నమఠం గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ఆయన అవార్డు అందుకోవడం గ్రామానికే కాకుండా కోనసీమ ప్రాంతానికి గర్వకారణమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు లంకె శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భూపతి రాజు ఈశ్వరవర్మ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ పెద్దలు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు మురళీకృష్ణను అభినందించి మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story