Amalapuram: అమలాపురం ఘనంగా ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలు

Amalapuram: కోనసీమలో ప్రపంచ జనాభా దినోత్సవం. కుటుంబ నియంత్రణ లబ్ధిదారులకు నగదు ప్రోత్సాహకాలు, ఉత్తమ వైద్య సిబ్బందికి పురస్కారాలు అందించిన కలెక్టర్ మహేష్ కుమార్.

PRABHU, RAZOLE
Published on: 18 July 2026 6:57 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురం ఘనంగా ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలు

అమలాపురం: ప్రపంచ జనాభా దినోత్సవం–2026 సందర్భంగా డాక్టర్ .బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కుటుంబ నియంత్రణ సేవలను ప్రోత్సహించేందుకు అర్హులైన లబ్ధిదారులకు నగదు ప్రోత్సాహకాలు అందజేయడంతో పాటు, ఉత్తమ సేవలందించిన వైద్య, ఆరోగ్య సిబ్బందిని ఘనంగా సన్మానించారు. స్థానిక కలెక్టరేట్‌ లోని వివేకానంద హాల్‌లో జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్, ఐఏఎస్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఈ నగదు ప్రోత్సాహకాలు, నగదు బహుమతులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.

కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి స్వచ్ఛందంగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న ముగ్గురు లబ్ధిదారులకు, పీపీఐయూసీడీ (PPIUCD) సేవలు పొందిన ఇద్దరు మహిళలకు, వ్యాసెక్టమీ/ట్యూబెక్టమీ సేవలు పొందిన ఇద్దరు లబ్ధిదారులకు, ఇంజెక్టబుల్ గర్భనిరోధక సేవలు పొందిన ఇద్దరు మహిళలకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందించారు.

కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అమలులో విశేష కృషి చేసిన వైద్య, ఆరోగ్య సిబ్బందికి నగదు బహుమతులు ప్రదానం చేశారు. ఉత్తమ గైనకాలజిస్టుగా ఏరియా ఆసుపత్రి, రామచంద్రాపురానికి చెందిన డా. బి.వి.వి.సి.హెచ్. సత్యవాణికి రూ.8 వేల నగదు బహుమతి అందజేశారు. ఉత్తమ వ్యాసెక్టమీ సర్జన్‌గా డా. ఎస్. ఏసేపుకు రూ.7 వేల బహుమతి ప్రదానం చేశారు. అలాగే ఆర్‌ఎంఎన్‌సీహెచ్ కౌన్సిలర్ ఎన్. రమాదేవి, అమలాపురం ఏఎన్‌ఎం పి. విజయశాంతి, రామచంద్రాపురం ఆశా కార్యకర్త వాసంశెట్టి గౌతమి, సఖినేటిపల్లి సీహెచ్‌ఓ/ఎంఎల్‌హెచ్‌పీ కె. షేబారాణిలకు రూ.2,500 చొప్పున నగదు బహుమతులు అందజేశారు. వీరందరికీ ప్రశంసాపత్రాలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి స్వచ్ఛందంగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న లంకే ధనలక్ష్మి (ఎన్. కొత్తపల్లి), బలసాడి మల్లేశ్వరి (బలుసుతిప్ప), వాడపల్లి జ్యోతి (ఆర్యావటం)లను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. దుర్గారావు, ఏరియా ఆసుపత్రుల వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story