Allavaram: సముద్రంలో చేపల వేటకు వెళ్లి రాకాని మత్స్యకారుల బోటు

Allavaram: ఓడలరేవు నుండి చేపల వేటకు వెళ్లి గల్లంతైన 8 మంది మత్స్యకారుల బోటు. కోస్ట్‌గార్డ్‌ను అప్రమత్తం చేసి గాలింపు చర్యలు చేపట్టాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశం.

SURESH, AMALAPURAM
Published on: 17 Aug 2026 4:54 PM IST
Allavaram
X

Allavaram: సముద్రంలో చేపల వేటకు వెళ్లి రాకాని మత్స్యకారుల బోటు

అల్లవరం: అల్లవరం మండలం ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు చెందిన IND-AP-E8-MO-135 బోటు ఆగస్టు 3న చేపల వేటకు వెళ్లినట్లు వెల్లడి.ఆగస్టు 13న తిరిగి రావాల్సి ఉండగా ఇప్పటివరకు బోటు వోడలరేవుకు చేరుకోలేదని అధికారుల సమాచారం.

బోటులో మొత్తం 8 మంది మత్స్యకారులు ఉన్నట్లు గుర్తింపు.బోటులో 15 రోజులకు సరిపడే రేషన్,1,000 లీటర్ల డీజిల్ ఉన్నట్లువెల్లడి.బోటు విశాఖపట్నం,పారాదీప్ తీర ప్రాంతాల వైపు వెళ్లినట్లు ప్రాథమిక సమాచారం.మత్స్యకారులతో ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందన లేకపోవడంతో అప్రమత్తమైన అధికారులు.

ఇండియన్ కోస్ట్‌గార్డ్‌కు సమాచారం అందించి గాలింపు, రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశం.జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో సమన్వయం చేసుకుని మత్స్యకారుల ఆచూకీ కోసం చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు.బోటు యజమాని,కుటుంబ సభ్యుల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించి కోస్ట్‌గార్డ్‌కు అందించాలని సూచన.మత్స్యకారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని కలెక్టర్ ఆదేశం.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story