Razole: ఆపరేషన్ కోసం రూ.56 వేల ఆర్థిక సాయం అందజేత

Razole: రాజోలు మండలం శివకోడుకు చెందిన శివనాగేంద్ర ఆపరేషన్ నిమిత్తం రూ.56 వేల ఆర్థిక సాయం అందించిన కోనసీమ బ్లడ్ డోనర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ.

PRABHU, RAZOLE
Published on: 16 Aug 2026 4:15 PM IST
Razole
X

Razole: ఆపరేషన్ కోసం రూ.56 వేల ఆర్థిక సాయం అందజేత

రాజోలు: డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం, శివకోడుకు చెందిన చిట్టూరి శివనాగేంద్ర ఆపరేషన్ కోసం కోనసీమ బ్లడ్ డోనర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆదివారం రూ.56 వేల ఆర్థిక సాయం అందించింది.

శివనాగేంద్రకు ఆపరేషన్ అవసరం కాగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న సంస్థ సభ్యులు దాతలను సంప్రదించారు. దాతల నుంచి సేకరించిన మొత్తాన్ని సమీకరించి బాధిత కుటుంబానికి అందజేశారు.

ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తదానంతో పాటు తమవంతు ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలుస్తున్నామని తెలిపారు.

ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలకు సహాయం చేయడం ద్వారా వారికి కొంత ఉపశమనం కల్పించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. మామిడికుదురు కేంద్రంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తమ సంస్థకు దాతలు, సేవాభావం కలిగిన వ్యక్తులు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. శివనాగేంద్ర త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story