Kesanapalli: కేశనపల్లి పరిధిలో డెంగ్యూ అవగాహన ర్యాలీ!
Kesanapalli: కోనసీమ జిల్లా కేశనపల్లి PHC పరిధిలోని గుబ్బలపాలెంలో డెంగ్యూ మాసోత్సవాల ర్యాలీ. ఇంటింటి సర్వే, పరిసరాల పరిశుభ్రతపై వైద్య సిబ్బంది అవగాహన.
Kesanapalli: కేశనపల్లి పరిధిలో డెంగ్యూ అవగాహన ర్యాలీ!
Kesanapalli: డెంగ్యూ మాసోత్సవాల సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం, కేశనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గుబ్బలపాలెం గ్రామంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.SUO ఆదినారాయణ ఆదేశాల మేరకు డాక్టర్ సాయి బాబా నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించి, ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే డ్రైడే’ కార్యక్రమాన్ని పాటించాలని వివరించారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, దోమతెరలను వినియోగించడం, జ్వరం వచ్చిన వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించి చికిత్స పొందాలని సూచించారు.
కార్యక్రమంలో MPHEO చంటి, మేల్ అసిస్టెంట్లు ఎస్. శ్రీరామ్ మూర్తి, కె. శివకుమార్, జి. గంగరాజు, MLHP కె. ప్రసన్న, MPHA(F) బేబీ పద్మకుమారి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.




