Rajahmundry: బుర్రిలంకలో మెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన మంత్రి!

Rajahmundry: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా కడియం మండలంలో చిరు సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన, ఉచిత వైద్య శిబిరం. పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 3 Sept 2026 10:34 AM IST
Rajahmundry
X

Rajahmundry: బుర్రిలంకలో మెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన మంత్రి!

Rajahmundry: గత 26 సంవత్సరాలుగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న సంస్థలలో "చిరు సేవాసమితి" కూడా ఒకటని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సెప్టెంబర్ 2వ తేదీ బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, కడియం మండలం బుర్రిలంక పిఎస్ఎం కళ్యాణ మండపంలో, చిరు సేవా సమితి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విచ్చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిరాటంకంగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం అంటే చిన్న విషయం కాదని, జన్మదిన వేడుకలను సేవా వేడుకలుగా మార్చుకుందామన్న పవన్ కళ్యాణ్ మాటలను శిరసావహిస్తున్న గెడ్డం శివ అభినందనీయుడని ప్రశంసించారు.

చిరు సేవాసమితి సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం కోసం "జై కొట్టు" అనే స్లొగన్ తో యువజన విభాగాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులు ర్యాలీ నిర్వహించారు.

వేమగిరి నుండి బయలుదేరిన ఈ ర్యాలీ కడియం, దోసాలమ్మ కాలనీ, కడియపులంక, బుర్రిలంక మీదుగా పిఎస్ఎం కళ్యాణ మండపానికి చేరుకుంది. అనంతరం మెగా రక్తదాన శిబిరం, ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించారు. వందలాదిమంది అభిమానులు, స్థానిక ప్రజలు ఈ శిబిరాలలో పాల్గొని రక్త దానం చేశారు.

ఈ కార్యక్రమంలో రత్నం అయ్యప్ప, గట్టి నరసయ్య, మార్గాని సత్యనారాయణ, గోరంట్ల రవి రామ్ కిరణ్, పాఠంశెట్టి రవి, పాఠంశెట్టి సుబ్బారావు, బొరుసు సుబ్బారాయుడు, మార్గాని ఏడుకొండలు, చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL

Next Story