Kadali: కడలిలో మెగాస్టార్ చిరంజీవి ముందస్తు పుట్టినరోజు వేడుకలు
Kadali: రాజోలు మండలం కడలిలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి ముందస్తు పుట్టినరోజు వేడుకలు. ప్రత్యేక పూజలు, మొక్కలు నాటిన మెగా అభిమానులు.
Kadali: కడలిలో మెగాస్టార్ చిరంజీవి ముందస్తు పుట్టినరోజు వేడుకలు
కడలి: రాజోలు తాలూకా చిరు, పవన్ సేవా సమితి, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల చిరు, పవన్, చరణ్ సేవా సమితుల పర్యవేక్షణలో మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి ముందస్తు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
రాజోలు మండలం కడలి గ్రామంలోని కపోతేశ్వర స్వామి దేవస్థానంలో మెగాస్టార్ చిరంజీవి పేరున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా మెగా అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అభిమానుల సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులు తెలిపారు.
Next Story




